Super Blue Moon (Credits: X)

Newdelhi, Aug 19: నేడు రాఖీపౌర్ణమి (Raksha Bandhan). సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. రక్షాబంధన్ రోజున ఒక ఖగోళ అద్భుత సంఘటన జరగబోతోంది. నేటి రాత్రి సూపర్ బ్లూ మూన్ (Super Blue Moon) కనిపించనుంది. నేడు అతిపెద్ద, ప్రకాశవంతమైన చంద్రుడు ప్రజలకు కనువిందు చేయనున్నాడు. పౌర్ణమి రోజు 25 శాతం సూపర్ మూన్‌ లు ఏర్పడితే 3 శాతం మాత్రమే బ్లూ మూన్స్‌ ఆవిష్కృతమవుతాయి. ఇక ఈ రెండింటి కలయికలో ఇంకా అరుదుగా సూపర్ బ్లూ మూన్ వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?

ఎలా ఏర్పడుతుంది అంటే?

నాసా పరిశోధకుల ప్రకారం.. పొగ, ధూళి తదితర చిన్న చిన్న కణాలు అప్పుడప్పడు చంద్రుడిపై పడే సూర్యుడి కాంతి ఎరుపు తరంగ ధైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమితో పోలిస్తే సూపర్‌మూన్ 30 శాతం వరకు ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ సూపర్ బ్లూ మూన్ సమయంలో చంద్రునిపై 98 శాతం సూర్యకాంతి ఉంటుంది. ఇది 100 శాతానికి కూడా పెరుగొచ్చు.

సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు