Cop Catching Chain Snatcher: కానిస్టేబుల్ అంటే ఇతడే, చైన్ దొంగతనం చేసి పారిపోతుంటే వెంటాడి దొంగను పట్టుకున్న ఢిల్లీ పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్న కానిస్టేబుల్, చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు.
ఢిల్లీలో సత్యేంద్ర అనే కానిస్టేబుల్ దొంగను పట్టుకునేందుకు చేసిన సాహసం వైరల్ అవుతోంది. షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైందన్న సమాచారం అందుకున్న కానిస్టేబుల్, చెయిన్‌తో పారిపోతున్న ఓ దొంగను వెంటాడి.. భైక్ మీద నుంచి దూకి మరీ అతన్ని పట్టుకున్నాడు. చెయిన్ రికవరీతో పాటు పారిపోతున్న ఆ దొంగను పట్టేసుకున్న సత్యేంద్ర ఉన్నతాధికారుల అభినందనలు సైతం అందుకున్నారు.
ఆ దొంగ మీద పదకొండు పెండింగ్ కేసులు ఉన్నాయని వాటిని ఈ కేసు ద్వారా విజయంతంగా పరిష్కరించగలిగామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేసిన ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా ట్రెండ్ అవుతోంది.
Here's Video
अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया।
इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए।
विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ
— Delhi Police (@DelhiPolice) November 24, 2022
(The above story first appeared on LatestLY on Nov 25, 2022 06:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

