SBI Home Loan Discounts: కస్టమర్లకు ఎస్బీఐ శుభవార్త.. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ.. 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
పండగ సీజన్‌లో భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇళ్ల రుణాలు తీసుకోవాలనుకునేవారికి పెద్ద ఊరట కల్పించింది. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర ఉండనుంది.
NewDelhi, October 10: భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఈ పండుగ సీజన్ లో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రుణగ్రహీతలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇళ్ల రుణాలు (SBI Home Loans) తీసుకోవాలనుకునేవారికి పెద్ద ఊరట కల్పించింది. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ (SBI home loan concession) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర ఉండనుంది. అంటే 0.15 శాతం నుంచి 0.30 శాతం తగ్గింపు అన్నమాట.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు
ఈ ఆఫర్‌ను 3 నెలలకుపైగా ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 4 నుంచి 2023 జనవరి 31 వరకు ఈ ప్రత్యేక రాయితీ ఆఫర్ తమ వినియోగదారులకు సిబిల్ స్కోర్ ఆధారంగా అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Oct 10, 2022 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

