Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..

బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.

Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..
Ganesh Visarjan (photo/X/Hyd Police)

Bengaluru, Sep 12: కర్ణాటకలోని బెంగళూరులో ఓ జంట 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో కూడిన గణేష్ విగ్రహాన్ని మొబైల్ ట్యాంక్‌లో పొరపాటున నిమజ్జనం చేశారు. నివేదిక ప్రకారం, 10 గంటల సుదీర్ఘ శోధన తర్వాత, దాదాపు 10,000 లీటర్ల నీటిని పంపింగ్ చేయడం. అక్కడ నిమజ్జనం చేయబడిన 300 విగ్రహాలు కరిగిపోయినందున, మందపాటి మట్టి పొరలో వెతకడంతో ఖరీదైన ఆభరణం తిరిగి లభించింది. ఈ ఘటన విజయనగర దాసరహళ్లి సర్కిల్‌లో చోటుచేసుకుంది. TOI నివేదిక ప్రకారం, విగ్రహం నిమజ్జనంలో జంటకు సహాయం చేసిన యువకుడు, నగలను ట్రాక్ చేసి కుటుంబానికి సురక్షితంగా తిరిగి ఇచ్చాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా ఆదివారం ఉదయం గొలుసు లభ్యమైంది.

ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో

పూర్తి వివరాల్లోకెళితే.. బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది. ఇంటికొచ్చాక గుర్తొచ్చి భోరున ఏడ్చేశారు. వినాయక చవితి పండుగను ఇంట్లో ఘనంగా చేసుకున్న రామయ్య-ఉమాదేవి దంపతులు విగ్రహం మెడలో ఖరీదైన బంగారు గొలుసు వేశారు. ఆ తర్వాత పత్రులతో అలంకరించడంతో గొలుసు కనిపించలేదు. అనంతరం ఓ మొబైల్ ట్యాంకులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేసి ఇంటికొచ్చారు.

ఆ తర్వాత వారికి గొలుసు విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఆగమేఘాలపై నిమజ్జనం చేసిన మొబైల్ ట్యాంకు వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో విషయం చెప్పారు. ఆ సమయంలో అక్కడున్న ఓ కుర్రాడు విగ్రహం మెడలో గొలుసు చూశానని, కాకపోతే అది రోల్డు గోల్డుదని అనుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ జంట పోలీసులు, ఎమ్మెల్యే ప్రియకృష్ణకు విషయం చెప్పారు. దీంతో ఆ గొలుసును వెతికి వారికి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశంతో మొత్తం పదిమంది మొబైల్ ట్యాంకులోకి దిగి గొలుసు కోసం గాలించారు. దాదాపు పది గంటల వెతుకులాట తర్వాత చైన్ దొరికింది. ఇందుకోసం మొత్తం 10 వేల లీటర్ల నీటిని తోడాల్సి వచ్చింది. అందులో అప్పటికే 300 విగ్రహాలను నిమజ్జనం చేయడంతో వెతకడం కష్టమైంది. మొత్తానికి పోయిన చైన్ తిరిగి దొరకడంతో ఆ జంట అక్కడున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 12, 2024 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).