Chhattisgarh Shocker: డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు.. ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!

వాళ్లిద్దరు ప్రేమికులు. గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరిమధ్య డబ్బుల విషయంలో తలెత్తిన విభేదాలు ఆ ప్రియుడి హత్యకు కారణమయ్యాయి. స్నేహితుడితో కలిసి ప్రియుడిని చంపేసిన ప్రియురాలు ఆపై మృతదేహాన్ని ఓ డమ్ములో పెట్టి అడవికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేసింది.

Chhattisgarh Shocker: డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు.. ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!
Credits: Google

Raipur, Dec 20: వాళ్లిద్దరు ప్రేమికులు (Lovers). గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరిమధ్య డబ్బుల విషయంలో (Money Issue) తలెత్తిన విభేదాలు ఆ ప్రియుడి  హత్యకు (Murder) కారణమయ్యాయి. స్నేహితుడితో కలిసి ప్రియుడిని చంపేసిన ప్రియురాలు ఆపై మృతదేహాన్ని ఓ డమ్ము (Drum)లో పెట్టి అడవికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేసింది. గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) రాజ్‌నంద్‌గావ్‌ (Rajnandgaon)లో జరిగింది. చంద్రభూషణ్, రాగిణి సాహు గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్నారు.

మెస్సీ అస్సాంలో పుట్టాడన్న కాంగ్రెస్ ఎంపీ... నెటిజన్ల భారీ ట్రోలింగ్.. ట్వీట్లు తొలగింపు

అయితే ఇటీవల చంద్రభూషణ్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది చంద్రభూషణ్‌దేనని గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె  చెప్పిన వివరాల ప్రకారం.. రాగిణికి చంద్రభూషణ్ గతంలో కొంతమొత్తం అప్పు ఇచ్చాడు.

శుభవార్త.. సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ

ఈ డబ్బు విషయంలో ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం ప్రియురాలిని చంద్రభూషణ్ బ్లాక్‌మెయిల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రియుడిపై పగ పెంచుకున్న రాగిణి తన స్నేహితుడైన నూతన సాహుతో కలిసి చంద్రభూషణ్‌ను హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి సమీపంలో అడవికి తీసుకెళ్లి తగలబెట్టేసింది. రాగిణి, ఆమె స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 20, 2022 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).