Newdelhi, Dec 20: అర్జెంటీనా (Argentina) ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) గెలవడాన్ని ఆ దేశంలోని వారే కాకుండా భారత్ లోని అభిమానులు కూడా ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే... దేశాలకు అతీతంగా అభిమానులను సొంతం చేసుకున్న లియోనెల్ మెస్సీ (Messi) ఆ జట్టులో ఉన్నాడు మరి. ఈ క్రమంలో మెస్సీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ (Abdul Khaleque) చేసిన ఓ ట్వీట్ ఆయన్ని అభాసుపాలయ్యేలా చేసింది.
అర్జెంటీనా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అస్సాంతో (Assam) సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నిస్తూ, మెస్సీకి అస్సాంతో కనెక్షన్ ఉందా? అంటూ ట్వీట్ చేయగా.... అవును, మెస్సీ అస్సాంలోనే పుట్టాడు అంటూ ఎంపీ బదులిచ్చారు. ఈ ట్వీట్లు కొద్ది సమయంలోనే వైరల్ అయ్యాయి. నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ తన ట్వీట్లను తొలగించారు.
After the world cup messi and his wife visited assam
Never forget where you come from pic.twitter.com/lw6SmMmFXe
— Desi Bhayo (@desi_bhayo88) December 19, 2022
— Professor ngl राजा बाबू ?? (@GaurangBhardwa1) December 19, 2022