Gujarat: ఇదేం గొడవ..భర్త పోస్టులకు వేరే మహిళ లైక్, కోపంతో మొగుడు ఫోన్‌ పగలగొట్టిన భార్య, ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త, పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ

సోషల్‌ మీడియాలో భర్త పోస్టులకు ఓ మహిళ లైక్ కొట్టిందని ఇద్దరు గొడవపడిన సంఘటన (Man, wife fight over ‘likes’ on social media in Vadodara ) గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Gujarat: ఇదేం గొడవ..భర్త పోస్టులకు వేరే మహిళ లైక్, కోపంతో మొగుడు ఫోన్‌ పగలగొట్టిన భార్య, ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త, పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ
Mobile (Photo Credit: File)

Vadodara, Oct 25: సోషల్‌ మీడియాలో భర్త పోస్టులకు ఓ మహిళ లైక్ కొట్టిందని ఇద్దరు గొడవపడిన సంఘటన (Man, wife fight over ‘likes’ on social media in Vadodara ) గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వడోదర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్‌ మీడియాలో వేర్వేరు అకౌంట్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్‌లకు వేరే మహిళ లైక్‌లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు (social media posts) చేసిన వెంటనే ఆ మహిళ లైక్‌లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్‌లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం (Heated argument) జరిగింది. భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు.

మంచి నిద్రలో భర్త.. సలసల కాగే నీటిని పురుషాంగంపై పోసిన భార్య, విలవిలలాడుతూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు, ఏలూరులో దారుణ ఘటన

ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్‌ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు.

(The above story first appeared on LatestLY on Oct 25, 2021 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).