Guru Pekalongan Viral Video: స్కూళ్లోనే రాసలీలల దుకాణం పెట్టేసిన ప్రధానోపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాలలోనే శృంగారం..

ఇండోనేషియాలోని సెంట్రల్ జావా, పెకలోంగన్ రీజెన్సీ పరిధిలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెడ్‌మాస్టర్), ఒక మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలోనే అశ్లీల చర్యకు ఒడిగట్టారు.

Guru Pekalongan Viral Video: స్కూళ్లోనే రాసలీలల దుకాణం పెట్టేసిన ప్రధానోపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాలలోనే శృంగారం..
Screenshot From Guru Pekalongan Viral Video (Photo Credits: X)

Guru Pekalongan Viral Video: ఇండోనేషియాలోని సెంట్రల్ జావా, పెకలోంగన్ రీజెన్సీ పరిధిలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెడ్‌మాస్టర్), ఒక మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలోనే అశ్లీల చర్యకు ఒడిగట్టారు. దీనికి సంబంధించిన 21 సెకన్ల సీసీటీవీ (CCTV) వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఆ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.

కెడుంగ్వూని జిల్లాలోని లాంగ్‌కాప్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిద్దరి ప్రవర్తనపై కొద్దిరోజులుగా అనుమానం ఉన్న పాఠశాల సిబ్బంది, వారి లీలలను బయటపెట్టేందుకు రహస్యంగా భద్రతా కెమెరాలను అమర్చారు. ఆ కెమెరాల్లో ఉపాధ్యాయుల రాసలీలలు స్పష్టంగా రికార్డయ్యాయి. వివాహితులైన ఈ ఇద్దరి లైంగిక చర్యల ఫుటేజ్ బయటకు రావడంతో పెకలోంగన్ రీజెన్సీ విద్యా, సాంస్కృతిక శాఖ (డిండిక్‌బుడ్) తక్షణమే విచారణకు ఆదేశించింది.

వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..

ఈ ఘటనపై విద్యాశాఖ అధిపతి ఖోలిద్ స్పందిస్తూ.. విచారణ అనంతరం ఇద్దరు నిందితులపై తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హెడ్‌మాస్టర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి, విద్యాశాఖ కార్యాలయంలో ప్రాధాన్యం లేని పరిపాలనా విధులకు బదిలీ చేశారు. కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిని అత్యంత మారుమూల ప్రాంతంలోని పాఠశాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. రీజెన్సీ తాత్కాలిక పాలనాధికారి ఆమోదం తర్వాత వారిపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, తీవ్ర వివాదం రాజేసిన అనంతరం ఆ మహిళా ఉపాధ్యాయురాలు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు, ఈ వీడియో వైరల్ కావడాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్, ఎక్స్ (X), టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పూర్తి వీడియో ఇస్తామంటూ నకిలీ, అనుమానాస్పద 'క్లిక్‌బైట్' (Clickbait) లింక్‌లను వ్యాప్తి చేస్తున్నారు. ఈ ఫేక్ లింక్‌లను క్లిక్ చేస్తే యూజర్ల ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్ వచ్చి పడే ప్రమాదముందని, వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే అవకాశముందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నెటిజన్లు ఇటువంటి నకిలీ వీడియో డౌన్‌లోడ్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు.

(The above story first appeared on LatestLY on Sep 07, 2026 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).