Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్‌ సింగర్‌తో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి.

Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్‌ సింగర్‌తో  హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు
Hardik Pandya Dating Jasmin Walia

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే  హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి.ఆ ఇద్ద‌రూ తాజాగా దిగిన ఫోటో లొకేష‌న్ ఒక‌టిగా ఉండ‌డంతో.. వారి మ‌ధ్య రొమాన్స్ న‌డుస్తున్న‌ట్లు ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని గంటల క్రితం హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. దీనికి నాలుగు రోజుల ముందు జాస్మిన్‌ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌లను ఒకరికొకరు లైక్‌ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. గతంలోనూ జాస్మిన్‌ పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో (Hardik Pandya Dating) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరి పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. భార్య‌తో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన హార్డిక పాండ్యా, అంతా అనుకున్న‌ట్లే విడాకులు తీసుకున్న పాండ్యా దంప‌తులు

సింగ‌ర్ జాస్మిన్ .. బ్లూ క‌ల‌ర్ బికినీ.. బ్లూ ష‌ర్ట్‌తో .. ఓ పూల్ వ‌ద్ద ఫోటో దిగింది. ఆ ఫోటో బ్యాక్‌డ్రాప్‌లో మైకోన‌స్ సీన‌రి క‌నిపిస్తోంది. స్ట్రా హ్యాట్‌, ఓవ‌ర్‌సైజ్ స‌న్‌గ్లాసెస్‌తో ఆమె ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే అదే పూల్ వ‌ద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేశాడు. క్రీమ్ క‌ల‌ర్ ప్యాంట్‌, ప్రింట్ ష‌ర్ట్‌, స‌న్‌గ్లాసెస్‌తో హార్దిక్ వెరైటీ లుక్‌లో ఉన్నాడు. ఫోటోల్లో ఇద్ద‌రి బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ కావ‌డంతో.. ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ట్రోలింగ్ మొద‌లుపెట్టారు. బ్రిటీష్ సింగ‌ర్‌, టెవీ ప‌ర్స‌నాల్టీగా జాస్మిన్‌కు గుర్తింపు ఉన్న‌ది. బ్రిటీష్ రియాల్టీ టీవీ సిరీస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ లో న‌టించిన‌ త‌ర్వాత ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది. మ‌రో వైపు హార్దిక్ పాండ్యా మాజీ భార్య న‌టాషా ప్ర‌స్తుతం సెర్బీయాలో ఉన్న‌ది.

Here's Tweets

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో పాండ్యా.. సెర్బియా నటి అయిన నటాషా (Natasa Stankovic) చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య విభేదాలు రావడంతో జులై 19న విడిపోతున్నట్లు ప్రకటించారు. అంతకు కొన్ని రోజుల ముందే కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్లిపోయింది.

(The above story first appeared on LatestLY on Aug 14, 2024 05:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).