Girlfriend Murder: ప్రేయసిపై ప్రియుడి కక్ష.. కారుతో తొక్కించి హత్య.. రక్తం ఏరులై పారినా.. అవయవాలు చెల్లాచెదురుగా పడినా.. అలాగే పలుమార్లు కారును ఎక్కించిన దుర్మార్గుడు..
Accident (Photo Credits: Twitter)

Beijing, August 8: చైనా (china)లోని హెబెయి (Hebei) ప్రోవిన్స్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రేయసినే కారు తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన గత  మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఝాంగ్ (Zhang) అనే వ్యక్తి ఓ స్విమ్మింగ్ పూల్ (Swimming pool) లో వర్కర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి వాంగ్  (wang) అనే ప్రేయసి ఉంది.

మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?

అయితే, ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావడంతో కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ఏమైందో ఏమో.. మంగళవారం మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఓ పని మీద వచ్చిన వాంగ్ ను ఝాంగ్ చూశాడు. తనను దూరం పెట్టిందన్న కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.  అంతే, విచక్షణారహితంగా పార్కింగ్ స్లాట్ లో ఉన్న ఓ కారు (Car)ను ఆమెపైకి ఎక్కించాడు. ఒక్కసారి కాదు.. పదే పదే కారును ఆమెపై నుంచి అటూ ఇటూ తీసికెళ్ళాడు. ఆమె రక్తం ఏరులై పారి, అవయవాలు నేలపై పడినా.. తాను ఆ కర్కశత్వ పర్వాన్ని విడిచిపెట్టలేదు. చివరకు వాంగ్ చనిపోయిందని నిర్దారించుకున్నాక పరారయ్యాడు. పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని అరెస్ట్ (Arrest) చేశారు.