MP Horror: మధ్యప్రదేశ్ లో దారుణం.. అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొన్నారని బతికుండానే మహిళలను పూడ్చేయత్నం.. వీడియో ఇదిగో!
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో కొందరు అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నించారు. దీన్ని ఇద్దరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Bhopal, July 21: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో కొందరు అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని (Road Construction) చేపట్టడానికి ప్రయత్నించారు. దీన్ని ఇద్దరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ అక్రమార్కులు డంపర్ లో మట్టి తెచ్చి ఆ ఇద్దరు మహిళలపై పోసి సజీవంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు. బాధిత మహిళలను రక్షించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. బాధితులను మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు.
నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
This #woman was #protesting against the #road being built in her land, the #incident is from #Rewa in #MadhyaPradesh.@bhopalcomm @MPPoliceDeptt @NCWIndia @womensaid #News #Breaking #Live #Help #trending #viral #ViralVideo #गुरुपूर्णिमा pic.twitter.com/MwYfGFG9Dk
— 6 Block South Patel Nagar (NGO REGD)🇮🇳 (@NgoPatelNagar) July 21, 2024
ఒకరి అరెస్ట్
వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి డంపర్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 22, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

