California, January 06: ఈ వీడియో ఉండేది కేవలం 9 సెకండ్లు మాత్రమే.. కాని ఆ వీడియోని చూస్తే (Horrifying Video) ఒక్కసారిగా గుండె ఝలదరిస్తుంది. ఓ యువకుడిని ఒక్కసారిగా అలలు అటాక్ (Huge Wave Sweep) చేశాయి. ఈ అలల దెబ్బకు ఈ యువకుడు పిచ్చుకలా కొట్టుకుపోయాడు. ఇక విషయంలోకి వెళ్తే...
శాంటా క్రజ్(Santa Cruz)లోని బొన్ని డూన్ బీచ్లో సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ యువకుడు సెకన్ల గ్యాప్లో చావుకు దగ్గరుగా వెళ్లి వచ్చాడు. కన్నుమూసి తెరిచే లోపు ఓ పెద్ద అల మృత్యువు రూపంలో ఆ యువకుడిని మింగేసేందుకు ప్రయత్నించింది. అంత పెద్ద అల వచ్చి పైన పడటంతో ఆ యువకుడు విసిరేసినట్లుగా చాలా దూరంలో పడిపోయాడు. డిసెంబర్-20,2019న కాలిఫోర్నియా ( California) రాష్ట్రంలోని శాంటా క్రజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బొన్ని డూన్ బీచ్(Bonny Doon Beach)కి ఓ 20ఏళ్ల యువకుడు సరదాగా గడుపుదామని వెళ్లాడు. సముద్రం దగ్గరే ఉన్న ఓ పెద్ద బండరాయి పైకి ఎక్కి సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంతలో అకస్మాత్తుగా వేగంగా వచ్చిన అల పైన పడి ఆ యువకుడు రాయి పైనుంచి సముద్రంలోకి పడిపోయాడు.
అయితే అదృష్టవశాత్తూ కాల్ ఫైర్,కాలిఫోర్నియా స్టేట్ పార్క్స్ రేంజర్స్ అలర్ట్ అయి ఆ యువకుడిని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.
శాంతా క్రజ్ కౌంటీ ఫేస్బుక్లో ఈ వీడియోను షేర్ చేస్తూ... పెద్ద అలలు వచ్చే అవకాశముందని,టూరిస్టులు అలర్ట్ గా ఉండాలని,సుముద్రం వైపు తిరగకండని ఓ అలర్ట్ మ మెసేజ్ కూడా ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.