Miss World 2023: ఈ దఫా మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో.. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడే.. 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు

ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్), విశ్వ సుందరి (మిస్ యూనివర్స్) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో జరగబోతున్నాయి.

Miss World 2023: ఈ దఫా మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో.. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడే.. 1996లో ఇండియాలో చివరిసారి జరిగిన అందాల పోటీలు
Miss World (Credits: Twitter)

Newdelhi, June 9: ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) (Miss World), విశ్వ సుందరి (మిస్ యూనివర్స్) (Miss Universe) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై అందరి దృష్టి ఉంటుంది. 2023 మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో (India) జరగబోతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలను నిర్వహించే అవకాశం మన దేశానికి దక్కింది. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో నవంబర్ లో జరగబోతున్నాయి. చివరి సారి ఇండియాలో 1996లో అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ మాట్లాడుతూ.. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఇండియాలో జరగబోతున్నాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. భారత్ లోని విభిన్న సంస్కృతులను, ప్రపంచ స్థాయి ఆకర్షణలను, సుందరమైన లొకేషన్లను ప్రపంచంతో పంచుకోబోతున్నామని తెలిపారు.

Monsoon 2023: తెలుగు రాష్ట్రాల్లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్న రుతుపవనాలు, వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని తెలిపిన ఐఎండీ

మన దేశం నుంచి ఇప్పటి వరకు మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచింది వీరే:

  • రీటా ఫరియా - 1966
  • ఐశ్వర్యా రాయ్ - 1994
  • డయానా హేడెన్ - 1997
  • యుక్తా ముఖి - 1999
  • ప్రియాంకా చోప్రా - 2000
  • మానుషి చిల్లార్ - 2017

 

(The above story first appeared on LatestLY on Jun 09, 2023 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).