Jharkhand Shocker: జార్ఖండ్‌లో దారుణం, అన్నా నొప్పి అంటూ ఏడుస్తున్నా వదలని కామాంధులు, 8 ఏళ్ళ బాలికపై పదే పదే గ్యాంగ్ రేప్, ఆపై గొంతు కోసి దారుణ హత్య

జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jharkhand Shocker: జార్ఖండ్‌లో దారుణం, అన్నా నొప్పి అంటూ ఏడుస్తున్నా వదలని కామాంధులు, 8 ఏళ్ళ బాలికపై పదే పదే గ్యాంగ్ రేప్, ఆపై గొంతు కోసి దారుణ హత్య
Rape (Rep Image)

సాహెబ్‌గంజ్, జూన్ 21: జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 20 ఏళ్ల యువకుడు, దాదాపు 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు

బుధవారం రాత్రి బాలికను నిందితులు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆపై వారు ఆమెను పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి, అక్కడ మళ్లీ అత్యాచారం చేశారని బర్హర్వా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) మంగళ్ సింగ్ జముదా తెలిపారు. నిందితులు ఆమెను గొంతుకోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని దాచిపెట్టారని అన్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికారి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2024 11:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).