Andhra Pradesh Shocker: బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద ఓ యువతి (21)పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాల పక్కనే యువతి మృతదేహం పడి ఉంది. ఆమెను స్థానిక సీతారాంపేటకు చెందిన యువతిగా గుర్తించారు.

Andhra Pradesh Shocker: బాపట్ల జిల్లాలో దారుణం, యువతిపై అత్యాచారం చేసి అనంతరం చంపేసిన కామాంధులు, ఘటనపై హోంమంత్రికి చంద్రబాబు కీలక ఆదేశాలు
AP Police (photo-X)

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద ఓ యువతి (21)పై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాల పక్కనే యువతి మృతదేహం పడి ఉంది. ఆమెను స్థానిక సీతారాంపేటకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.  ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు, ఒడ్డుకు కొట్టుకువచ్చిన మూడు మృతదేహాలు, మరొకరి కోసం గాలింపు చర్యలు

మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. వేగంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా, జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర హోంమంత్రి అనిత బాపట్ల జిల్లా ఈపూరుపాలెం వెళ్లి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇదే అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2024 09:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).