బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడగా తాజాగా ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
జూన్ 21న శుక్రవారం ఏలూరుజిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు రామాపురం బీచ్‌లో విహారయాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్ళారు. స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్ళాల్లో తెలియక సముద్రంలో కొంతదూరం వెళ్ళారు. పెద్ద అలలు రావడంతో 11 మంది విద్యార్దుల్లో 4గురు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్ధులు నితిన్ (21), అమలరాజు( 22), తేజ( 24), కిషోర్( 22)లుగా గుర్తించారు. కొద్దిసేపటికి వీరిలో మూడు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ధి మృతదేహం కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.
Here's Video and Images
విహారయాత్రలో విషాదం.. సముద్రంలో గల్లంతైన యువకులు
బాపట్ల - రామాపురంలోని బీచ్ వద్దకు ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామనికి చెందిన 11 మంది యువకులు విహారయాత్రకు వచ్చారు.
11 మంది యువకులు సముద్రంలోకి స్నానానికి దిగగా ఆరుగురు గల్లంతయ్యారు.. వీరిలో ఇద్దరు మృతదేహాలు లభ్యమవగా,… pic.twitter.com/jlw6eDwqOr
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)