అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా ఉన్న కృష్ణవేణి అనే మహిళకు సంబంధించిన అక్క పని చేస్తోంది. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వేడి పాలను ఫ్యాన్ కింద గిన్నెలో అక్కడ ఉంచారు. అయితే అక్కడే ఆడుకుంటూ ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు ఆ వేడి గిన్నెలో పడిపోయింది. తీవ్ర గాయాలతో కేకలు వేస్తున్న చిన్నారి అరుపులు విన్న తల్లి వెంటనే అక్కడకు చేరుకుని బయటకు తీసింది.

తదుపరి వైద్య సేవ కోసం చిన్నారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. చిన్పారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు నిలిచారు. ఈ విషాదకర ఘటనపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల లోపాలు, సెక్యూరిటీ లోపాలను గమనిస్తూ, బాధ్యతా నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

వీడియో ఇదిగో.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్,తమిళనాడులోని వెల్లూరులో సంఘటన, మొత్తం దృశ్యం CCTVలో రికార్ట్

Toddler Dies After Falling Into Boiling Milk Container 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)