crime-scene (Rep Image)

మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం రోజున దేశాయ్ గ్రామం సమీపంలోని వంతెన క్రింద అనుమానాస్పదమైన సూట్‌కేసును అక్కడి ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని సూట్‌కేసు తెరిచినప్పుడు, అందులో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు బయటపడింది. మృతురాలి చేతిపైన ‘P V S’ అక్షరాలతో ఉన్న పచ్చబొట్టు దర్యాప్తుకు కీలక ఆధారమైంది.

ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఈ పచ్చబొట్టు వివరాలు, సోషల్ మీడియా పరిశీలన, దగ్గర్లో ఉన్న సీసీటీవీ క్లిప్‌ల ఆధారంగా పోలీసులు మృతురాలిని ప్రియాంక విశ్వకర్మ (22)గా గుర్తించారు. ఆమెతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న వినోద్ శ్రీనివాస్ విశ్వకర్మ (50)పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతన్ని ప్రశ్నించగా, అతను చివరికి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 21 రాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో వినోద్, ప్రియాంక గొంతు నులిమి చంపేశాడు.

అనంతరం ఒక రోజు పాటు శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడట. శరీరం నుండి దుర్వాసన రావడం ప్రారంభమైన తర్వాత, నవంబర్ 22 రాత్రి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి, కాలినడకన తీసుకెళ్లి వంతెనపై నుండి కాలువలో పడేశాడు. ఈ కేసులో వినోద్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, హత్య, సాక్ష్యాల నాశనం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.