Death-Rep Image)

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్చరల్ టౌన్‌షిప్‌లో పవన్ ఇతర స్నేహితులతో కలిసి నాలుగేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన గుంటూరు జిల్లా వాసి.

ఈ కాలంలో పవన్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ పెరుగుతూ, ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని శారీరకంగా చేరువయ్యారు. అయితే ఇటీవల ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లుగా తెలుసుకున్న పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కోపంతో ఆ యువతి వ్యక్తిగత ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపించిన పవన్‌పై ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన

పోలీసులు ఆ కేసులో విచారణ ప్రారంభించడంతో, యువతి తననుంచి పూర్తిగా దూరమైంది. ఈ పరిణామాలతో భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయిన పవన్, సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకుని జీవితాన్ని ముగించాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఆ యువతిపైనా కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది.