ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 2.34 గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి

Speeding Bike Rear-Ends Lorry in Bapatla

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)