కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. కొంతకాలంగా ధైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజయ్యే సమయానికి ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. చూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి చేరింది.
ఈ వ్యాధి కారణంగా అతడు బక్కపలుచగా మారిపోయారు, కానీ, పొట్టభాగం మాత్రం ఉబ్బిపోయింది. చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు అవుతాయని.. ఎవరైనా సాయం చేయండంటూ ఆగస్టులో మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచిన సాయం చేశారు. గతంలో యష్ కూడా సాయం చేశారు.హరీశ్ రాయ్.. ఓం, రాజ్ బహదూర్, దండుపాల్య, సంజు వెడ్స్ గీత వంటి పలు చిత్రాల్లో నటించారు.
Harish Rai Dies:
ಕನ್ನಡದ ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ಖಳನಟರಾದ ಹರೀಶ್ ರಾಯ್ ಅವರು ನಿಧನರಾಗಿರುವುದು ಅತ್ಯಂತ ದುಃಖಕರ ಸಂಗತಿಯಾಗಿದೆ. ಕ್ಯಾನ್ಸರ್ನಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದ ಹರೀಶ್ ರಾಯ್ ಅವರ ನಿಧನದಿಂದ ಚಿತ್ರರಂಗ ಬಡವಾಗಿದೆ.
ಓಂ, ಹಲೋಯಮ ಸೇರಿದಂತೆ ಕೆಜಿಎಫ್ ಮತ್ತು ಕೆಜಿಎಫ್ 2 ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ಹರೀಶ್ ರಾಯ್ ಅವರು ಅದ್ಭುತವಾಗಿ ನಟಿಸಿ ಎಲ್ಲರ ಗಮನಸೆಳೆದಿದ್ದರು. ಹರೀಶ್… pic.twitter.com/Q86Ot36Nub
— DK Shivakumar (@DKShivakumar) November 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)