Ikkis Trailer Out: ఇక్కీస్‌ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ

భారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.

Ikkis Trailer Out: ఇక్కీస్‌ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ
Amitabh Bachchan; Agastya Nanda in Ikkis Trailer (Photo Credits: X, YouTube)

భారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది. అంధాధున్ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీరామ్ రాఘవన్ ఈ యుద్ధ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఈ చిత్రంలో అరుణ్ ఖేతర్‌పాల్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనతో పాటు ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఛావా సినిమా ఎఫెక్ట్.. గుప్త నిధుల వేటలో పడ్డ జనం, సినిమాలో నిధి గురించి పుకార్లు వచ్చిన నేపథ్యంలో ప్రజల తవ్వకాలు, వీడియో ఇదిగో

1971 ఇండో–పాక్ యుద్ధం నేపథ్యంగా సాగే ఈ చిత్రం, కేవలం 21 ఏళ్ల వయసులోనే అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఖేతర్‌పాల్ వీరత్వాన్ని చూపిస్తుంది. దేశ రక్షణ కోసం చివరి వరకూ పోరాడిన ఆయన త్యాగానికి గాను మరణానంతరం పరమవీర్ చక్ర అవార్డు లభించింది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, దేశభక్తి భావం అద్భుతంగా మేళవించబడ్డాయి. అగస్త్య నందా నటన, రాఘవన్ దర్శకత్వం, మరియు శక్తివంతమైన నేపథ్య సంగీతం ఇప్పటికే సినీప్రేమికులలో ఆసక్తి రేపుతున్నాయి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 30, 2025 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).