హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం రాత్రి రామ్‌లీలా నాట‌కం సమయంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాటకంలో దశరథుడి పాత్ర పోషిస్తున్న సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ అమ్రిశ్ కుమార్ స్టేజ్‌పైనే అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి లైవ్ ప్రదర్శన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా స్టేజ్ థియేటర్‌లో నిష్ణాత నటుడిగా పేరుగాంచిన అమ్రిశ్ కుమార్, గత అయిదు దశాబ్దాలుగా రామ్‌లీలా నాటకాల్లో ప్రధాన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నాటకంలోని దశరథుడు పాత్రలో తన డైలాగ్స్ చెబుతూ ఉన్న సమయంలో అతనికి గుండెపోటు సంభవించింది. తక్షణమే అతను కూలిపోయాడు. ఇతర పాత్రధారులు, ప్రేక్షకులు ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందారు. నిర్వాహకులు వెంటనే నాటకాన్ని నిలిపివేసి అమ్రిశ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, డాక్టర్లు అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు.

షాకింగ్ వీడియో ఇదిగో, ఉపాధ్యాయురాలిపై హెడ్‌మాస్టర్‌ లైంగిక వేధింపులు..అడిగినందుకు విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి, నిందితుడు అరెస్ట్

అమ్రిశ్ కుమార్ రామ్‌లీలా నాటకాల్లో దశరథుడు, రావణుడు వంటి ప్రధాన పాత్రల్లో నటిస్తూ సీన్‌కి ప్రాణం పోసేవాడు. అతని శక్తివంతమైన డైలాగ్స్, స్టేజ్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుండేవి. అమ్రిశ్ మృతి వార్తా బయటకు వచ్చిన వెంటనే రామ్‌లీలా క్లబ్ సభ్యులు, సహకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంఘీభావం వ్యక్తం చేసిన సుదేశ్ మహాజన్ మాట్లాడుతూ, ఇది మాకెంతో తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాదం నేపథ్యంలో రామ్‌లీలా క్లబ్ కొన్ని రోజులపాటు షోల‌ను రద్దు చేసింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో థియేటర్ ప్రపంచాన్ని షాక్‌లో ఉంచింది. సీనియర్ నటుడి అకస్మాత్తు మరణం స్థానిక ప్రేక్షకులు, కళాకారులలో తీవ్ర విచారం సృష్టించింది.

Himachal Veteran Actor Collapses While Playing King Dashrath

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)