Viral Pics: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ
కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
Mysuru, Jan 27: కేజీఎఫ్ (KGF) నటుడు (Actor) వశిష్ఠ సింహా (Vasishta Simha).. పిల్ల జమీందార్ (Pilla Jamindhar) నటి (Actress) హరిప్రియ (Haripriya) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మీడియాకు దూరంగా మైసూరులో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లికి హాజరైన నటుడు ధనంజయ వారి పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం.. వీడియోతో..
హరిప్రియ ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘పిల్ల జమీందర్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ వంటి సినిమాల్లో నటించారు. ఇక, ‘నారప్ప’ సినిమాతో తెలుగులో కనిపించిన కన్నడ నటుడు వశిష్ఠ సింహా ఆ తర్వాత ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాల్లో నటించారు. కేజీఎఫ్‌లో ఆయన చేసిన కమల్ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు షురూ.. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందే కూల్చేయాలని నిర్ణయం
ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟಿರುವ ವಸಿಷ್ಠ ಸಿಂಹ ಮತ್ತು ಹರಿಪ್ರಿಯಾ ಅವರಿಗೆ ಶುಭವಾಗಲಿ💞
Happy Married Life ❤@ImSimhaa @HariPrriya6 #NamCinema #Simhapriya #vasishtasimha #haripriya pic.twitter.com/OpISfN1JM1
— 𝐍𝐀𝐌𝐂𝐈𝐍𝐄𝐌𝐀 (@NamCinema) January 26, 2023
Happy Married Life #SimhaPriya 💖#Vasishtasimha #Haripriya pic.twitter.com/KzUXFs8ZcD
— FILMY CORNER (@filmycorner9) January 26, 2023
(The above story first appeared on LatestLY on Jan 27, 2023 08:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

