Live Heart Stroke: మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు.. లైవ్ లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత.. కర్ణాటకలో ఘటన
కర్ణాటకలో మూడా భూ కుంభకోణం వివాదం ప్రస్తుతం సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, దీనిపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ తాత్కాలిక ఊరట లభించడం తెలిసిందే.
Bengaluru, Aug 20: కర్ణాటకలో (Karnataka) మూడా భూ కుంభకోణం (MUDA Scam) వివాదం ప్రస్తుతం సంచలనంగా మారింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం, దీనిపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ తాత్కాలిక ఊరట లభించడం తెలిసిందే. అయితే, మూడా భూ కుంభకోణం వివాదంలో సిద్ధరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పలువురు కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు.
హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన.. పలు ప్రాంతాలు జలమయం
మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు.. లైవ్లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత
మూడా కుంభకోణం వివాదంలో సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్.
సంఘటన స్థలంలోనే లైవ్లో ప్రాణాలు విడిచిన సీకే రవిచంద్రన్. pic.twitter.com/rPF4oUgSrd
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
లైవ్ లో మాట్లాడుతుండగా..
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ ప్రెస్ తో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుర్చీ మీద నుంచి కిందపడిపోయారు. పక్కనఉన్నవాళ్లు అలర్ట్ అయ్యేలోపు సంఘటన స్థలంలోనే లైవ్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Aug 20, 2024 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

