Hyderabad, Aug 20: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) అతలాకుతలం అవుతున్నది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. అలాగే ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
వానలు ఎక్కడెక్కడ అంటే?
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, అబిడ్స్, నాంపల్లి, నాగోల్, అంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మేట్, జీడిమెట్ల, సూరారం, సుచిత్ర, బషీర్ బాగ్, ఉప్పల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, లక్డికాపుల్, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, జగద్గిరిగుట్ట, బోయిన్ పల్లి, బహదూర్ పల్లి, గుండ్లపోచం పల్లి, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.
బెంగాల్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్కడ మహిళలకు భద్రత కరువైందంటూ ఆరోపణ