Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.
Bengaluru, August 15: కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది. అయితే, అందంగా కనిపించాలన్న భార్య ఆరాటం ఉమేశ్‌కి నచ్చేది కాదు. అనుమానిస్తూ పలుమార్లు ఇదే విషయమై ఆమెతో గొడవ పడ్డాడు. భర్త తనను అనుమానిస్తూ, వేధిస్తుండడాన్ని సహించలేకపోయిన దివ్య ఇక లాభం లేదని విడాకులకు దరఖాస్తు చేసుకుంది. వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము
మంగళవారం ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను మారిపోయానని, ఇకపై అనుమానించబోనంటూ భార్యను నమ్మించాడు. భర్త మాటలు నమ్మిన దివ్య.. ఉమేశ్ వెంట వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఊజగల్లు దేవాలయానికి తీసుకెళ్లిన ఉమేశ్.. దర్శనం అనంతరం సమీపంలోని కొండవద్దకు తీసుకెళ్లాడు.
ముందస్తు ప్లాన్‌లో భాగంగా అప్పటికే అక్కడ నలుగురు స్నేహితులను ఉంచిన ఉమేశ్.. వారితో కలిసి దివ్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన ఉమేశ్ కోసం గాలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 15, 2024 02:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

