Karnataka Shocker: దారుణం, పోలీస్ స్టేషన్‌లోనే భార్యను కత్తితో పొడిచి చంపిన కానిస్టేబుల్, ఫిర్యాదు చేయడానికి వచ్చిందనే కక్షే కారణం

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడైన పోలీసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన మహిళను మమతగా గుర్తించగా, నిందితుడు లోకనాథ్‌గా గుర్తించారు

Karnataka Shocker: దారుణం, పోలీస్ స్టేషన్‌లోనే భార్యను కత్తితో పొడిచి చంపిన కానిస్టేబుల్, ఫిర్యాదు చేయడానికి వచ్చిందనే కక్షే కారణం
Crime (Photo-File)

హసన్, జూలై 1: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడైన పోలీసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన మహిళను మమతగా గుర్తించగా, నిందితుడు లోకనాథ్‌గా గుర్తించారు.కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు మమత ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  గాజువాకలో దారుణం, కోడలి నోట్లో మామ పురుగుమందు పోస్తే ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టిన భర్త, చికిత్సపొందుతూ బాధితురాలు మృతి

భార్య ఫిర్యాదు చేయడానికి రావడంతో కోపోద్రిక్తుడైన భర్త లోకనాథ్..పోలీసు సిబ్బంది, ప్రజల సమక్షంలోనే ఆమె ఛాతీపై కత్తితో పొడిచి చంపాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మమత మృతి చెందింది.నిందితుడు పోలీస్ కానిస్టేబుల్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నాడు. లోకనాథ్, మమతలకు వివాహమై 17 ఏళ్లు కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య గత నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. లోకనాథ్ శాంతిగ్రామంలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై హసన్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 02, 2024 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).