Drunk and Drive Funny Video: పుల్లుగా తాగి బైకుతో కుస్తీలు పడిన మందు బాబు, కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ..మద్యం మత్తులో అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, మద్యం సేవించి వాహనం నడపొద్దు అంటూ అవగాహన
ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై ఓ ప్రబుద్ధుడు రోడ్డుమీదకొచ్చాడు . మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు.
Hyderabad, July 10: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో వారి ప్రాణాలతో పాటు... ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. పోలీసులు మద్యం తాగి బండి నడపొద్దని పదే పదే చెప్తున్నా.. వారికి అవి ఎక్కడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన తాగి నడిపే వారిలో మార్పు రావడం లేదు. రోడ్డు పక్కన చితక్కొట్టుకున్న అమ్మాయిలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముగ్గురు యువతుల ఫైటింగ్ వీడియో, కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు
అయితే తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాల గురించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి (Drunk and Drive Funny Video) వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై ఓ ప్రబుద్ధుడు రోడ్డుమీదకొచ్చాడు . మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు.
Here's Cyberabad Traffic Police Tweet
కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో
ఇబ్రహీంపల్లి గేట్, చేవెళ్ల. 04.07.2021#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/ZDJvlTjOV2
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 9, 2021
ఈ సంఘటన ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల నాలుగున చోటుచేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (CYBERABAD TRAFFIC POLICE) ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ (Krishna gaari veera gadha) అంటూ ట్విటర్‌లో షేర్ చేశారు.
పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాడ్రౌండ్ మ్యూజిక్, ఎమోజీలను జోడించి ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోడ్డంతా నాదే అన్నట్లు సాగే ఆ మందుబాబు డ్రైవింగ్ విన్యాసాలు నవ్వులు పూయించడమే కాదు.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతరులకు ఎంత ప్రమాదకరమో ఈ వీడియో అద్దంపడుతోంది.
(The above story first appeared on LatestLY on Jul 10, 2021 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

