Kurnool Shocker: కర్నూలు ఆసుపత్రిలో దారుణం, మహిళ బాత్రూంలో స్నానం చేస్తుంటే, గోడ మీదకు ఎక్కి న్యూడ్ వీడియోలు తీసిన యువకుడు..ఇంతలో ఏం జరిగిందంటే..

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాధిత మహిళ ఆసుపత్రిలోనే బాత్రూంలో స్నానం చేస్తుంటే ఓ అగంతకుడు కిటికీలోంచి న్యూడ్ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడు.

Kurnool Shocker: కర్నూలు ఆసుపత్రిలో దారుణం, మహిళ బాత్రూంలో స్నానం చేస్తుంటే, గోడ మీదకు ఎక్కి న్యూడ్ వీడియోలు తీసిన యువకుడు..ఇంతలో ఏం జరిగిందంటే..
file

మానవత్వం రోజురోజుకీ మంట కలిసి పోతుంది. కామాంధులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ కామ దాహం తీర్చుకోవడానికి, ఇల్లు, బడి, ఆసుపత్రి అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు.  తాజాగా కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  బాధిత మహిళ ఆసుపత్రిలోనే బాత్రూంలో స్నానం చేస్తుంటే ఓ అగంతకుడు కిటికీలోంచి న్యూడ్ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడు. దీంతో అక్కడ గమనించినటువంటి ప్రజలు నిందితుడిని పట్టుకొని చితకబాదారు.  పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు సిటీలోని సర్వజన వైద్యశాలలో ఆదివారం మధ్యాహ్నం న్యూడ్ వీడియో కేసు కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్వకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి హాస్పిటల్‌కు వచ్చాడు. అయితే వచ్చిన వాడు రోగిని చూసి వెళ్లిపోకుండా, ఓ దురాలోచన చేశాడు.

Telangana Shocker: అన్నా అని పిలిచినా బాలికను వదలని అన్నదమ్ములైన ...

పక్కనే బాత్రూంలో స్నానం చేస్తున్న ఓ రోగి సహాయకురాలిని గమనించి బాత్రూం గోడపైకి ఎక్కి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఆమె అది గమనించి.. గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆసుపత్రిలో ఉన్నవారు అతడిని పట్టుకొని చితకబాదుడు బాదారు. ఆసుపత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

 

(The above story first appeared on LatestLY on Mar 14, 2023 12:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).