Ranchi, June 13: మద్యం ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది అంటారు. దీన్ని నిజం చేస్తూ.. మద్యం (Alcohol) మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడినే (Son) బలితీసుకున్నాడు. రూ.10 అడిగినందుకు ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని (Jharkhand) ఛత్రాజిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే, బీలేశ్ భూయాన్(48) తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు యాదవ్‌తో కలిసి వశిష్టనగర్ లో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం భార్యభర్తలు పూటుగా తాగి గొడవపడ్డారు. ఈ క్రమంలో బాలుడు పది రూపాయలు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూయాన్ విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి పొట్టనపెట్టుకున్నాడు.
అలా విషయం బయటకు..
ఈ క్రమంలో ఇసుకబట్టిలో తన పని ముగించుకుని కుమార్తె ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చాక తండ్రి చేసిన ఘోరం గురించి తెలిసి భయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో, అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.