Kollywood Horror: చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?
కోలీవుడ్ హాస్యనటుడు ఏబీ రాజు అరెస్ట్.. చిన్నారిపై లైంగిక వేధింపులే కారణం
Chennai, August 18: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ హాస్య నటుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో హాస్యనటుడు ఏబీ రాజును (AB Raju) పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై వలసరవక్కంకు చెందిన మోహన్ సినిమాలో సహాయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య బుల్లితెరపై నటిస్తున్నారు.
రైళ్ళలో ఐదేండ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలి అంటూ వార్తలు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే?
వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఏబీ రాజు ఇంటికి వెళ్లి ఆడుకోవడం చిన్నారికి అలవాటు. అలా ఇటీవల బాలిక నటుడి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికకు చాక్లెట్లు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాజు. విషయం బయట పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 18, 2022 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

