Mumbai Cop's Dance Video: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న ముంబై పోలీస్ డ్యాన్స్ వీడియో, అప్పు రాజా సినిమాలో ఆయా హైన్ రాజా అనే పాటకు స్టెప్పులు వేసిన అమోల్ యశ్వంత్ కాంబ్లే
ఇప్పుడు సోషల్ మీడియాలో ముంబై పోలీస్ డ్యాన్స్ వీడియో (Mumbai Cop's Dance Video) వైరల్ అవుతోంది. ముంబైలోని అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే 38 ఏళ్ల పోలీస్ అధికారి ప్రస్తుతం తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. అతను పోలీస్ అధికారి అయినప్పటికీ పర్‌ఫెక్ట్ డ్యాన్స్ స్టెప్పులతో అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు.ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అమోల్ యశ్వంత్ కాంబ్లేకు (Anmol Yashwant Kamble) నైగావ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగంతోపాటు కాంబ్లేకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగా విధులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా తరుచూ డ్యాన్స్ చేయడం ఇతనికి అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా తన డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ‘అప్పు రాజా’ సినిమాలోని ఆయా హై రాజా పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వడంతో వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి.
అయితే వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని కాంబ్లే తెలిపారు. డ్యూటీలో ఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశామని, ఈ ఉద్ధేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని వెల్లడించారు. కాగా మాహిమ్ ప్రాంతంలో నివాసముంటున్న కాంబ్లే 2004 లో పోలీస్ శాఖలో చేరాడు.
Here's Mumbai Cop Anmol Yashwant Kamble Dance Video
View this post on Instagram
అయితే ఇతనికి చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై అమితమైన పిచ్చి. ఎన్నో స్టేజులమీద ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తన డ్యాన్ అభిరుచిపై తమ్ముడు స్పందిస్తూ..‘ మా అన్నయ్య కొరియోగ్రాఫర్.. పోలీస్ ఉద్యోగంలో చేరేముందు తనతో కలిసి కొన్ని డ్యాన్స్ షోలు చేశాను. ఇప్పుడు కూడా వీక్లీ ఆఫ్‌లు, ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుంటాను.’ అని తెలిపాడు.
(The above story first appeared on LatestLY on Aug 08, 2021 03:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).