Image used for representational purpose | (Photo Credits: PTI)

Patna, Sep 15: బీహార్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తన ఖాతాలో పడిన డబ్బులను తిరిగి ఇవ్వనంటూ ఓ వ్యక్తి అధికారులను ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖ‌గారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్య‌క్తి బ్యాంక్ ఖాతాలోకి ఇటీవల 5.5 ల‌క్ష‌లు క్రెడిట్ (wrongfully credited funds) అయ్యాయి.

అయితే బ్యాంక్ సిబ్బంది చేసిన పొరపాటు వ‌ల్ల ఆ డబ్బు అత‌ని ఖాతాలో ప‌డింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అతనికి నోటీసులు పంపిన స్పందించలేదు. అనంతరం వారు జరిగిన విషయాన్ని దాస్‌కి వివరించి డ‌బ్బును వాప‌స్ ఇవ్వాలని కోరగా అత‌ను నిరాక‌రించాడు. అందుకు బదులుగా అతను.. ఇది ప్ర‌ధాని పంపిన డ‌బ్బు అని, తిరిగి ఇచ్చే ప్రసక్తే లేద‌న్నాడు.

బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై రంజిత్ దాస్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారించగా.."ఈ సంవత్సరం మార్చిలో అకస్మాత్తుగా నా బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు చేరాయి. అందుకు చాలా సంతోషించాను.

ఎమ్మెల్యేగారు.. మీరు వెంటనే నాకు లవర్‌ని వెతికిపెట్టండి, మీ ఏరియాలో అమ్మాయిల్ని ప్రేమించేలా ప్రోత్సాహించండి, మహారాష్ట్ర ఎమ్మెల్యే సుభాశ్‌ ధొతేకి లేఖ రాసిన గుర్తు తెలియని యువకుడు

గతంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi sent me money) వాగ్దానం చేశారు కదా, కనుక ఇది మొదటి విడత కావచ్చునని నేను అనుకున్నాను. అలా భావించి డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసాను. ఇప్పుడు, నా ఖాతాలో దగ్గర డబ్బు లేవని‘‘ దాస్ తెలిపాడు.