Progeny: ‘అవును. నా భర్త తప్పు చేశాడు. జైలులో ఉన్నాడు. అయితే, ఆయన తప్పు చేస్తే, నాకెందుకు శిక్ష? నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, అతను నాకు సంతానాన్ని ఇవ్వాల్సిందే. ఆయనను విడుదల చేయండి. మేము కలిసి పిల్లల్ని కంటాం.’ ఓ వివాహిత పిటిషన్.. కోర్టు ఏమన్నదంటే?
తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
Jaipur, October 17: ‘అవును. నా భర్త తప్పు చేశాడు. జైలులో ఉన్నాడు. అయితే, ఆయన తప్పు చేస్తే, నాకెందుకు శిక్ష? నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, అతను నాకు సంతానాన్ని ఇవ్వాల్సిందే. ఆయనను విడుదల చేయండి. మేము కలిసి పిల్లల్ని కంటాం’ అంటూ తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్(Petition)పై కోర్టు (Court) సానుకూలంగా స్పందించింది. అత్యాచారం (Rape) కేసులో జైలు శిక్ష (Jail) అనుభవిస్తున్న ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ (Perole) మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన రాహుల్ (25) బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ‘నా భర్త తప్పు చేస్తే, ఆ శిక్ష నాకెందుకు విధిస్తారు. నా వంశాన్ని నిలుపుకోవాలి. ఆయనతో సంతానాన్ని పొందేలా అనుమతించండి’ అంటూ విన్నవించింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ కోరికను మన్నించింది. దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె తన వంశ పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. పిటిషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందన్న కోర్టు.. దోషికి 15 రోజుల పెరోలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని సూచించింది.
(The above story first appeared on LatestLY on Oct 17, 2022 09:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

