 
                                                                 Agra, OCT 16: భార్యపై అనుమానంతో కూతురును (Daughter), భార్యను (Wife) హత్య చేశాడో దుర్మార్గుడు. కూతురుకు తన పోలికలు లేవని (Suspicion of Infidelity) దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఇటీవల ఆగ్రా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా, ఖండ్వాలి ప్రాంతానికి చెందిన మన్మోహన్ సింగ్‌కు(manmohan Singh), మమతకు కొంత కాలం క్రితం పెళ్లైంది. వారికి సౌమ్య అనే ఏడాది వయసున్న కూతురుంది. అయితే, సౌమ్యకు తన పోలికలు లేవని (Suspicion of Infidelity) మన్మోహన్ భావించాడు. తన ముఖానికి, సౌమ్య ముఖానికి సంబంధం లేదని అనుమానించాడు. దీంతో ఆ పాప తన కూతురు కాదేమోనని భావించి, భార్యతో అనేకసార్లు వాగ్వాదానికి దిగాడు. చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ పాప తన కూతురు కాదని, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 1న భార్యను, కూతురు సౌమ్యను హత్య చేశాడు.
అయితే ఈ హత్యలకు సంబంధించి మిస్టరీ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు...విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. అయితే మన్మోహన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అనుమానం ఎంత పని చేస్తుందో! ఎన్ని దారుణాలకు దారి తీస్తుందో చెప్పేందుకు ఇది ప్రత్యక ఉదాహరణ అంటున్నారు స్థానికులు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
