Pooja Hegde : అరెరె.. మామంచి సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. ఎందుకంటే?
ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం 'సీతారామం'లో సీత పాత్రను మిస్ చేసుకున్న పూజా హెగ్డే.. కరోనాతో షూటింగ్ లేట్ కావడమే కారణం.
Hyderabad, August 7: మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన చిత్రం 'సీతారామం' (Sitaramam). ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నటించిన మృణాల్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించడం తెలిసిందే. సీత పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానానికి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే నిజానికి సీత పాత్రకు మృణాల్ కాకుండా ముందు వేరే హీరోయిన్‌ను అనుకున్నారట.
మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్.. ఈ అందాల రాశి మనసులో మాట ఏముందంటే?
బుట్టబొమ్మ పాటతో అభిమానుల మనసు దోచుకున్న పూజాహెగ్డేను (Poojahegde) ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. కానీ కరోనా వల్ల షూటింగ్ లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో సీత వంటి మంచి పాత్రను ఆమె మిస్ చేసుకుంది. కాగా, ఈమధ్య సరైన హిట్స్ లేక తంటాలు పడుతున్న పూజా ఈ సినిమా నుంచి తప్పుకొని ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
(The above story first appeared on LatestLY on Aug 07, 2022 01:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

