Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు
మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.
Pune, August 8: మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అయితే, వీరి మృతిపై అసలు కారణాలు తెలియాల్సి ఉంది.జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు అని అధికారులు తెలిపారు. పుణెను కుదిపేస్తున్న జికా వైరస్.. ఆరు కేసులు నమోదు.. పాజిటివ్ జాబితాలో ఇద్దరు గర్భిణులు
'66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు.' అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణానికి అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది.
మరణానికి అసలు కారణంపై చర్చ జరిగినప్పటికీ, పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం తమ నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపింది. పుణేలో ఈ ఏడాది జూన్ 20న తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఎరంద్వానే ప్రాంతంలో 46 ఏళ్ల డాక్టర్, అతని 15 ఏళ్ల కూతురుకు పాజిటివ్ వచ్చింది.
(The above story first appeared on LatestLY on Aug 08, 2024 06:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

