Aryan Khan : షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట.. మరి ఎలా?
షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట.. రచయితగా నిరూపించుకుంటాడట
Mumbai, August 14: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. స్టార్ హీరోల వారసుడు అంటే హీరో(Hero)గానే ఎంట్రీ ఇస్తుంటారు కదా. కానీ దీనికి భిన్నంగా.. ఆర్యన్ రచయిత(Writer)గా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్(Talent)ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్‌సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ (Real Life)ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట.
కల్యాణ్‌రామ్‌తో కలిసి 'బింబిసార' సినిమాను చూసిన బాలయ్య.. నందమూరి హీరోపై ప్రశంసలు.. ఫోటోలు వైరల్
మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తుంది.
(The above story first appeared on LatestLY on Aug 14, 2022 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

