Noida Accident: నోయిడాలోనూ ఢిల్లీ తరహా ఘోర ప్రమాదం.. స్విగ్గీ ఏజెంట్ ను ఈడ్చుకెళ్లిన కారు

ఢిల్లీలో కొత్త సంవత్సరం రోజు జరిగిన ఘోర ప్రమాదం తరహాలోనే నోయిడాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ను ఢీ కొట్టిన కారు.. దాదాపు కిలోమీటరు మేర ఆ యువకుడిని ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.

Noida Accident: నోయిడాలోనూ ఢిల్లీ తరహా ఘోర ప్రమాదం.. స్విగ్గీ ఏజెంట్ ను ఈడ్చుకెళ్లిన కారు
Credits: Twitter/ANI

Noida, Jan 5: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) కొత్త సంవత్సరం రోజు జరిగిన ఘోర ప్రమాదం తరహాలోనే నోయిడాలో (Noida) మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్విగ్గీ (Swiggy) డెలివరీ ఏజెంట్ (Delivery Agent) ను ఢీ కొట్టిన కారు (Car).. దాదాపు కిలోమీటరు మేర ఆ యువకుడిని ఈడ్చుకెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. జనవరి 1న అర్ధరాత్రి నోయిడాలోని సెక్టార్ 14 లో ఈ ప్రమాదం జరిగింది.

యూపీలోనూ ఢిల్లీ లాంటి ఘటన.. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టి మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ.. వీడియోతో

నోయిడాకు చెందిన కౌశల్ స్విగ్గీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. జనవరి 1న రాత్రిపూట డెలివరీ కోసం వెళుతుండగా సెక్టార్ 14 లోని ఓ ఫ్లై ఓవర్ దగ్గర వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. బైక్ తో పాటు కౌశల్ కారు కిందపడిపోయాడు. కారు అలాగే ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. కారు కింద చిక్కుకున్న కౌశల్ ను ఈడ్చుకుంటూ దాదాపు కిలోమీటర్ మేర వెళ్లింది. అక్కడ కారును ఆపి కిందికి దిగిన డ్రైవర్ కు కౌశల్ బాడీ కనిపించింది.

ఉటాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు మైనర్లు

దీంతో భయపడి డ్రైవర్ పారిపోయాడని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాళ్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jan 05, 2023 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).