Tungabhadra Dam Gate Chain Snaps (Credits: X)

Newdelhi, Aug 11: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ (Tungabhadra Dam) 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నీరు (Flood Water) నదిలోకి చేరుతున్నది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

ఎలా జరిగింది? ఏం చేయబోతున్నారు?

జలాశయానికి వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను క్రమబద్దీకరణ చేస్తున్న సమయంలో ఈ  సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయినట్టు వివరించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. అప్పటివరకూ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

యూట్యూబ్ మాజీ సీఈవో క‌న్నుమూత‌, రెండేళ్ల పాటూ క్యాన్స‌ర్ తో పోరాడి మ‌ర‌ణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మంటూ పిచాయ్ ట్వీట్