Uttarakhand Landslide Video: బద్రీనాథ్‌లో ఉన్నట్టుండి కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడి జాతీయ రహదారి మీద నుంచి లోయలోకి రాళ్ళు గుట్టలుగా జారాయి. జోషిమత్‌లోని చుంగిధార్ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దాని పక్కగానే జాతీయ రహదారి ఉంది.
కొండ చరియలు పడిన సమయంలో చాలా వాహనాలు ఆ దారి గుండా వెళుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వందల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం కలుగులేదు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు బద్రీనాథ్ హైవేని బ్లాక్ చేసి శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా గతకొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్డును దాటుతుండగా టెంపో వాహనంపై విరిగిపడిన కొండచరియలు, భారీ లోయలో పడిపోయిన వాహనం, వీడియో ఇదిగో..
Here's Videos
उत्तराखंड : बद्रीनाथ हाईवे पर जोशीमठ से एक किलोमीटर पहले आज दोबारा फिर से लैंड स्लाइड हुआ है। इस बार पूरा का पूरा पहाड़ टूटकर गिर गया। आज सुबह भी इसी पॉइंट पर लैंड स्लाइड हुआ था। मौसम साफ है, फिर भी पहाड़ दरक रहे हैं। ये खतरनाक स्थिति है। pic.twitter.com/fApi8lhr6R
— Sachin Gupta (@SachinGuptaUP) July 9, 2024
ये देखिए कैसे टूटकर गिरा पहाड़, जोशीमठ की है घटना, बद्रीनाथ हाईवे बंद, कोई हताहत नहीं लेकिन रास्ता खुलने में लगेगा समय। #HeavyRain #joshimath #chamoli #badrinathhighway #uttarakhand pic.twitter.com/ertoxS9BeB
— Ajit Singh Rathi (@AjitSinghRathi) July 9, 2024