Uttar Pradesh: కొడుకు మృతి.. కోడలిని 70 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న మామ, పెళ్లికి సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు
యూపీలోని గోరఖ్ పూర్ లో గల ఛపియా ఉమారో అనే గ్రామంలో ఓ 72 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల తన కోడలిని పెళ్లిచేసుకున్నాడు. 72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు.
యూపీలోని గోరఖ్ పూర్ లో గల ఛపియా ఉమారో అనే గ్రామంలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల తన కోడలిని పెళ్లిచేసుకున్నాడు. 72 ఏళ్ల కైలాష్ అనే వ్యక్తి బరహల్‌గంజ్ పోలీస్టేషన్‌లో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఐతే అతని మూడో కొడుకు కూడా అనుకోకుండా మరణించాడు. దీంతో అతని కోడలు పూజా వితంతువుగా మారడంతో అప్పటి నుంచి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది.
అయితే కొద్ది రోజుల క్రితం మళ్లీ తన భర్త ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. దీనికి కారణం ఏంటని స్థానికులు ఆరా తీస్తే కైలాష్ అనే వృద్ధుడు తన కోడలు పూజానే ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం గుప్పుమంది. ఈ ఫోటో కాస్త పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో బర్హల్‌గంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై విచారిస్తామని చెప్పారు.
Here's Photo
गोरखपुर: 70 साल के कैलाश यादव ने 28 साल की खुदकी बहु पूजा से मंदिर में जाके शादी कर ली @SureshChavhanke देख रहा हैंhttps://t.co/LTwOw0GFez pic.twitter.com/Bo4N2o52Q3
— Mohammad Tanvir تنوير (@TanveerPost) January 27, 2023
(The above story first appeared on LatestLY on Jan 27, 2023 09:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

