Bath Inside Metro: మెట్రో ట్రైన్‌లో అందరిముందే బట్టలు విప్పి స్నానం చేసిన యువకుడు, ఒక్కచుక్క నీరు కిందపడకుండా అతను చేసిన పనికి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు
Bath Inside Metro (PIC @ FB)

New York, April 10: మెట్రో.. ఈ మధ్య కాలంలో వింతలు, విచిత్రాలు, గొడవలు, షాకింగ్ ఘటనలకు కేరాఫ్ గా మారింది. మెట్రోలో (Metro train).. ఎన్నడూ చూడని, కనీసం వినని ఘటనలు జరిగిపోతున్నాయి. మెట్రోలో ప్రయాణం చేసే వారిలో కొందరు ఊహకు అందని చర్యలతో అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. హద్దు మీరి ప్రవర్తించే వారి సంఖ్య మెట్రో రైళ్లలో పెరిగిపోతోంది. ఇటీవల ఢిల్లీ మెట్రోలో (Delhi metro).. ఓ అమ్మాయి బికినీ లాంటి డ్రెస్ లో అర్థనగ్నంగా కనిపించడం దుమారం రేపింది. ఒంటి మీద బ్రా, మినీ స్కర్ట్ మినహా మరేమీ లేవు. దీంతో ఆ యువతి వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు మరో వ్యక్తి వ్యవహరించాడు. ఆ వ్యక్తి చేసిన పని అందరికీ దిమ్మతిరిగేలా చేసింది. ఇంతకీ అతగాడు ఏం చేశాడో తెలుసా.. కదులుతున్న మెట్రోలో ఏకంగా స్నానమే (Takes Bath Inside Metro) చేసేశాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే.. దుస్తులు విప్పి మరీ స్నానం చేశాడు. ఈ షాకింగ్ ఘటన జరిగింది మన దేశంలో కాదు. న్యూయార్క్ సిటీలో. న్యూయార్క్ సిటీ సబ్ వే ట్రైన్ లో (City Subway Train) ఈ ఘటన వెలుగుచూసింది.

కోచ్ లోని కంపార్ట్ మెంట్ లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. అందరి ప్రయాణికుల్లా అతడూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో సడెన్ గా పైకి లేచాడు. అందరూ చూస్తుండగానే.. తన షూస్ తీసేశాడు. ఆ తర్వాత ప్యాంటు విప్పేశాడు. షర్ట్ తీసేశాడు. అండర్ వేర్ మాత్రం ఉంచుకున్నాడు. ఆ తర్వాత సూట్ కేస్ లాంటి ట్రాలీ బాగ్ ఓపెన్ చేశాడు. అందులో ఓ వాటర్ బాటిల్ ఉంది. అది ఓపెన్ చేసి అందులోని నీటిని ట్రాలీ బ్యాగ్ లో పోశాడు. ఆ తర్వాత అందులోనే ఉన్న స్పాంజ్ చేతికి తీసుకున్నాడు. ఆ స్పాంజ్ ని నీటిలో అద్దాడు. ఆ నీటిని తన ఒంటి మీద పోసుకున్నాడు. ఆ తర్వాత నురగ వచ్చే క్రీమ్ ని శరీరానికి రాసుకున్నాడు. ఇలా.. తోటి ప్రయాణికుల ముందే.. అతడు స్నానం చేశాడు. నురగ వచ్చే లిక్విడ్ ఒంటికి రుద్దుకున్నాడు. ఆ తర్వాత ఒంటి మీద స్పాంజితో ఎంతో జాగ్రత్తగా నీళ్లు కూడా పోసుకున్నాడు. ఆ తర్వాత టవల్ తో జాగ్రత్తగా ఒళ్లంతా తుడుచుకున్నాడు. అయితే, ఒక్క చుక్క నీరు కూడా బయటకు రానివ్వలేదు అతడు. నీరంతా సూట్ కేస్ లాంటి ట్రాలీ బ్యాగులోనే ఉండిపోయింది. ఆ తర్వాత అతగాడు డ్రెస్ వేసుకున్నాడు.

Kailash Vijay Vargiya: ఆ దుస్తులలో శూర్పణఖలా ఉంటారు.. మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు 

ఆ వ్యక్తి చర్యతో తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉండిపోయారు. కొందరేమో అతడికి దూరంగా పక్కకు జరిగారు. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరికొందరు ప్రయాణికులు నవ్వుతూ అక్కడే ఉండిపోయారు. ఆ వ్యక్తి స్నానం చేస్తుండగా.. తోటి ప్రయాణికుడు ఒకరు వీడియో తీశాడు. కదులుతున్న రైల్లో వ్యక్తి స్నానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడెవడండీ బాబూ అని నెటిజన్లు నివ్వెరపోతున్నారు.

Delhi Horror: కుక్క విషయంలో తలెత్తిన గొడవ.. గర్ల్ ఫ్రెండ్ తల్లిని కాల్చిన ప్రియుడు.. తర్వాత ఏమైంది? 

కొందరేమో అతడిని తిట్టిపోస్తున్నారు. స్టుపిడ్ అని మండిపడుతున్నారు. మరికొందరేమో.. చాలా సాహసం చేశాడని కామెంట్ చేస్తున్నారు. పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం అతడిలా పిచ్చి పని చేశాడని ఇంకొందరు సీరియస్ అయ్యారు. కొందరేమో అతడిని మెచ్చుకున్నారు. అతడు ఎంతో పద్ధతిగా స్నానం చేశాడని, తోటి ప్రయాణికుల మీద ఒక్క చుక్క నీరు కూడా పడనివ్వలేదన్నారు. ఎంతో జాగ్రత్తగా స్నానం చేశాడని కితాబిస్తున్నారు.