Ghaziabad Accident: ఘజియాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్‌యూవీ కారును ఢీకొన్న పాఠశాల బస్సు.. ఆరుగురి మృతి.. వీడియోతో
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Ghaziabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు (School Bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Ghaziabad, July 11: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) ఘజియాబాద్ (Ghaziabad)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ కారును (Car) పాఠశాల బస్సు (School Bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే (Delhi -Meerut Expressway)పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
WATCH - School Bus-SUV Crash On Delhi-Meerut Expressway Near Ghaziabad, 6 Dead.#BusAccident #Ghaziabad #DelhiMeerutExpressway pic.twitter.com/djl7m4CZRp
— TIMES NOW (@TimesNow) July 11, 2023
తప్పు ఎవరిదంటే?
ఢిల్లీలోని ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్ లో వెళ్తున్న పాఠశాల బస్సు.. అదే సమయంలో మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్‌యూవీ కారు (SUV Car)ను ఢీ కొట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానంద్ కుష్వా తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 11, 2023 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

