Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం బావి పక్కన పిల్లాడితో ప్రమాదకరంగా కూర్చుని ఈ మహాతల్లి ఏం చేసిందో మీరూ చూడండి..! (వీడియో)
డిఫరెంట్ రీల్స్ చెయ్యాలి. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలకు కూడా ఇదే ధ్యాసగా మారింది.
Newdelhi, Sep 22: డిఫరెంట్ రీల్స్ (Reels) చెయ్యాలి. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలకు కూడా ఇదే ధ్యాసగా మారింది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరరీతిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇబ్బందుల్లో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ రీల్స్ కోసం బావిపై కూర్చుని చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)
Here's Video:
రీల్స్ పిచ్చి.. పిల్లాడి ప్రాణం రిస్క్ పెట్టాలా?
రీల్స్ చేసేందుకు కొంతమంది ఎంతకైనా
తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఓ పిల్లాడి ప్రాణాన్ని రిస్కులో పెట్టింది. బావిలో కాలు పెట్టి, ఆ కాలుకు చిన్నారిని వేలాడదీసి రీల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో సదరు మహిళ పట్ల నెటిజన్లు తీవ్ర… pic.twitter.com/gO8YI0DJQ4
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
కాళ్లను బావిలోకి వేలాడదీసి..
బావి గట్టు పైన కూర్చున్న ఆమె తన కాళ్లను బావిలోకి వేలాడదీసింది. అంతటితో ఆగకుండా పిల్లాడి చేతులు పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ పాటకు యాక్షన్ చేస్తోంది. అటూ, ఇటూ ప్రమాదకరంగా కదులుతూ పాట పాడుతోంది. మరోవైపు పిల్లాడు భయపడుతూ వణికిపోతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మహిళ చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 22, 2024 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

