Hyderabad, Sep 22: వినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు (Police) బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా (Hydra) మళ్లీ రంగంలోకి దిగింది. హైడ్రా బుల్డోజర్లు ఈసారి కూకట్ పల్లి నల్ల చెరువు ఆక్రమణలపై దృష్టి సారించాయి. 27 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆదివారం ఉదయం ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు హైడ్రా అధికారులు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. చెరువులోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఏడెకరాలు ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్ జోన్ లలోని నాలుగెకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్ మెంట్లు నిర్మించారు. అలాగే, ఎఫ్ టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Here's Video:
హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణల పై హైడ్రా కొరడా. నల్లచెరువు అనుకొని ఉన్నా నిర్మాణాలు కూల్చివేసేందుకు తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది. pic.twitter.com/2jyaiTx09R
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
కేవలం అవే కూల్చివేత
ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నివాసం ఉండే భవనాల జోలికి వెళ్లబోమని హైడ్రా ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.