Simhadri Appanna Temple

Vizag, SEP 21: తిరుమలలో స్వామివారికి సమర్పించే నైవేద్యం, లడ్డూ తయారి (Tirumala laddu ) లో కల్తీ నెయ్యిని వాడారని వచ్చిన వార్తలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మరో ప్రసిద్ధ ఆలయమైన సింహాచలానికి (Simhachalam prasadam) తిరుమల ఎఫెక్ట్‌ తగిలింది . ఆలయంలో తయారు చేసే లడ్డూలతో పాటు ఇతర ఆహార తయారికి వాడుతున్న పదార్థాలను టెస్టింగ్‌ (Testing) కు పంపించనున్నారు. ఈ సందర్భంగా భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు(MLA Ganta Srinivasrao) శనివారం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహా ఆలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.

Tirupati Laddu Issue: తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం 

వ్యవస్థలన్నింటీని సర్వనాశనం చేసిన ఆయన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. మంచి నెయ్యి రూ.600 -వెయ్యి రూపాయలకు లభిస్తుండగా నాణ్యత లేని కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి భక్తుల మనోభావాలను మంటగలిపారని పేర్కొన్నారు. ఘటన తరువాత వైఎస్‌ జగన్‌ చరిత్రహీనుడిగా మిగిలిపో నున్నారని వెల్లడించారు. డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడడం లేదని తెలిపారు. సింహాచలం ఆలయంలో తయారు చేసే పదార్థాలను సైతం అధికారులతో టెస్టింగ్‌కు పంపించనున్నామని స్పష్టం చేశారు.