67th National Film Awards: తెలుగు సినిమాకు అయిదు జాతీయ అవార్డులు, సత్తా చాటిన నాని జెర్సీ, మహేష్ బాబు మహర్షి సినిమాలు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు ఐదు అవార్డులతో సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో (67th National Film Awards) సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్ స్టార్ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు (Tollywood industry gets 5 national awards) దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అవార్డులు పొందాయి.
ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు.
We are happy to share that a very special film #Maharshi has won the National Award for Best Film Providing Wholesome Entertainer.
Thank you @urstrulyMahesh garu, @DirectorVamshi, @allarinaresh, @hegdepooja, @thisisdsp and the entire team for making this an unforgettable film ! pic.twitter.com/tKV1B9ojr6
— Sri Venkateswara Creations (@SVC_official) March 22, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2021 06:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

