Shreyas Talpade: షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ప్రముఖ బాలీవుడ్ నటుడికి గుండెపోటు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) (47) ముంబైలో షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు
Actor Shreyas Talpade suffers heart attack: ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) (47) ముంబైలో షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పరిశీలనలో ఉన్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన తల్పాడే మంచి గుర్తింపు పొందాడు. ‘ఇక్బాల్’, గోల్‌మాల్ రిటర్న్, ఓం శాంతి ఓం, హౌస్‌ఫుల్ – 2 వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం ‘వెల్ కమ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, దిశా పటానీ, సునీల్ శెట్టి, పరేష్ రావల్, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, రాజ్‌పాల్ యాదవ్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, రాహుల్ దేవ్, ముఖేష్ తివారీ, షరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్నారు.
Here's ANI Tweet
#WATCH | Mumbai: Visuals from outside Bellevue Hospital where Actor Shreyas Talpade has been admitted after he suffered a heart attack https://t.co/sfsgUfqa2u pic.twitter.com/7qmWa8Hl2x
— ANI (@ANI) December 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 15, 2023 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

